గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 12:34:24

కాబోయే భ‌ర్త‌తో కాజ‌ల్ ఫొటో షూట్.. ఫొటోలు వైర‌ల్

కాబోయే భ‌ర్త‌తో కాజ‌ల్ ఫొటో షూట్.. ఫొటోలు వైర‌ల్

ఈ ఏడాది సినీ తార‌లు త‌మ‌కు నచ్చిన వారితో పెళ్లి పీట‌లు ఎక్కుతూ అభిమానుల‌లో సంతోషం నింపుతున్నారు .  దిల్ రాజు, నిఖిల్‌, రానా, నితిన్ వంటి ప్ర‌ముఖులు లాక్ డౌన్ స‌మ‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకొని పెళ్ళి చేసుకున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ అక్టోబ‌ర్ 30న త‌న చిన్న‌నాటి స్నేహితుడిని వివాహ‌మాడ‌నుండ‌గా, నిహారిక కూడా త్వ‌ర‌లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్ట‌నుంది. 

తెలుగు తెర‌పై కాంతులీనుత‌న్న అందాల జాబిలి కాజ‌ల్ అగ‌ర్వాల్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కాబోయే భ‌ర్త‌తో క‌లిసి ఫోటోలు దిగింది.ఈ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి. ఫోటోల‌లో ఇద్ద‌రు ఒకే రంగు బ‌ట్ట‌లు ధ‌రించ‌డం విశేషం. గౌత‌మ్ ముంబయిలో గుర్తింపుపొందిన వ్యాపారవేత్త, ఇంటీరియర్‌ డిజైనర్‌, ఫ్యాషన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్నారు . వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహమని చెబుతున్నారు.  ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో ..  కాజల్‌ అగర్వాల్‌ అమ్మనాన్న సుమన్‌ అగర్వాల్‌, వినయ్‌ అగర్వాల్‌ ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.