ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 13:52:44

హ‌ల్దీ వేడుక‌లో కాజ‌ల్ చిందులు.. వీడియో వైర‌ల్‌

హ‌ల్దీ వేడుక‌లో కాజ‌ల్ చిందులు.. వీడియో వైర‌ల్‌

ఈ రోజు సాయంత్రం త‌న ప్రియుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకోనున్న కాజ‌ల్ ప్ర‌స్తుతం పెళ్ళిప‌నుల‌తో బిజీగా ఉంది. గ‌త నాలుగు రోజుల నుండి వీరింట పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన‌గా, సంద‌డిగా సాగిన‌   మెహందీ, హ‌ల్దీ,సంగీత్ వేడుక‌లలో కాజ‌ల్ మెరిసిపోయింది. తాజాగా హ‌ల్దీ వేడుక‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

హ‌ల్దీ వేడుక‌లో కాజ‌ల్ ప‌సుపు రంగు దుస్తులతో పాటు పూల ఆభ‌ర‌ణాలు ధ‌రించింది. చంద‌మామ‌లా క‌నిపిస్తున్న కాజ‌ల్‌ని చూసి అభిమానులు మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు. ఇక కాజ‌ల్ హ‌ల్దీ వేడుక‌లో డ్యాన్స్ చేస్తూ త‌న ఫ్యామిలీని కూడా ఉత్సాహ‌ర‌పరిచింది. సోనా సోనా అనే పాట‌కు కాజ‌ల్‌తో పాటు ఆమె సోద‌రి నిషా కూడా కాలు క‌దిపింది. నిషా త‌న కుమారుడు ఇషాన్ వ‌లేచాని ఎత్తుకొని మ‌రీ చిందులేసింది. అంతేకాదు గౌత‌మ్ కిచ్లుని కూడా డ్యాన్స్ చేసేందుకు ఆహ్వానించింది.ప్ర‌స్తుతం కాజ‌ల్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.