ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 18:39:35

నాన్నతో కాజల్‌ అగర్వాల్‌..ఫొటోలు వైరల్‌

నాన్నతో కాజల్‌ అగర్వాల్‌..ఫొటోలు వైరల్‌

చందమామ చిత్రంలో తన ఓరచూపుతో అందరి హృదయాలను దోచేసింది అందాల భామ కాజల్‌. ఈ సినిమా తర్వాత కాజల్ వరుస ఆఫర్లు దక్కించుకుని..టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అప్పడప్పుడు తన సోదరి నిషాతో కలిసి కనిపించే కాజల్‌..నాన్నతో  కలిసి కెమెరా కంట పడ్డ సందర్భాలు తక్కువే. కాజల్‌ కు నాన్నంటే ఎంతో ఇష్టం. నాన్నతో కలిసి తనకిష్టమైన ప్రదేశాలకు వెళ్లడం, తన ఇష్టాయిష్టాలను పంచుకోవడం, సరదాగా షికార్లు కొట్టడమంటే కాజల్ కు చాలా ఇష్టం.

కాజల్‌ తండ్రి వినయ్‌ అగర్వాల్‌ టెక్స్‌టైల్‌ బిజినెస్‌ మెన్‌. ఫాదర్‌తో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించినపుడు, ఈవెంట్స్‌కు వెళ్లినపుడు, వేడుకలు జరుపుకున్నపుడు తీసిన కొన్ని ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. కాజల్‌కు తండ్రి అంటే ఎంతిష్టమో ఈ ఫొటోలే చెప్తున్నాయి . 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo