శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 16:42:10

చావు క‌బురు చ‌ల్ల‌గా 'క‌దిలే కాలాన్న‌డిగా' సాంగ్

చావు క‌బురు చ‌ల్ల‌గా 'క‌దిలే కాలాన్న‌డిగా' సాంగ్

టాలీవుడ్ యాక్ల‌ర్లు కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. డెబ్యూట్ డైరెక్ట‌ర్ కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.  ఇప్ప‌టికే మొద‌టి పాట‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా రెండో పాట‌ను రిలీజ్ చేశారు. 'క‌దిలే కాలాన్న‌డిగా..ఈ చోటె ప‌రుగాప‌మ‌ని..తిరిగే భూమిని అడిగా నీ వైపే న‌ను లాగ‌మ‌ని..'అంటూ బ‌స్తీ బాల‌రాజు, మ‌ల్లికల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ స‌న్నివేశాల‌తో సాగే ఈ సాంగ్ మంచి లిరిక్స్ తో ఆక‌ట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసిన 'మై నేమ్ ఈజ్‌ రాజు' మొద‌టి సాంగ్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది.


ఈ మూవీని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయ 'బ‌స్తీ బాల‌రాజు',  లావణ్య త్రిపాఠి ‘మల్లిక’ పాత్ర‌ల్లో క‌నిపించ‌నుండ‌గా..ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo