సోమవారం 25 మే 2020
Cinema - Apr 06, 2020 , 15:19:55

షాకింగ్ : క‌రోనాకి వ్యాక్సిన్ క‌నుగొన్న బాలీవుడ్ న‌టుడు!

షాకింగ్ : క‌రోనాకి వ్యాక్సిన్ క‌నుగొన్న బాలీవుడ్ న‌టుడు!

ప్ర‌పంచాన్ని వణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి నుండి బ‌య‌ట‌ప‌డేందుకు అన్ని దేశాలు నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ని క‌నుగొనేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాయి. అయితే ఎందరో ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌ల వ‌లన కాని ప‌నిని మ‌న బాలీవుడ్ హీరో చేసి చూపించాడ‌ట‌. అయితే నిదంతా నిజంలో కాదులేండి. కల‌లో మాత్ర‌మే.

యంగ్‌ బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్ చాలా చురుకైన వ్య‌క్తి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకి మంచి వినోదాన్ని అందిస్తుంటాడు. తాజాగా ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు చుట్టూ గుమిగూడి ఉండగా, మధ్యలో కారుపై  నిల్చొని  చేయి ఊపుతున్నట్లు ఉండే ఓ వీడియోను షేర్ చేశాడు కార్తీక్. దీనికి  ‘కరోనా వైరస్‌ కోసం నేను వ్యాక్సిన్‌ కనుగొన్నానని కల కన్నాను.’ అనే క్యాప్షన్ ఇచ్చాడు . అదేదో నిజ‌జీవితంలో క‌నుకున్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చావ్‌గా అని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు  ‘భాయ్‌ బయోటెక్నాలజి చదివుంటాడు’ అని కామెంట్‌ చేస్తున్నారు.  

నెటిజ‌న్స్ ట్వీట్స్ పై స్పందించిన కార్తీక్‌.. ‘మీరు బయోటెక్నాలజీ నుంచి ఒక భాయ్‌ను తొలగించవచ్చు, కాని మీరు భాయ్ నుంచి బయోటెక్నాలజీని తొలగించలేరు’. అంటూ బదులిచ్చారు. ముంబైలోని డీవై పాటిల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి కార్తీక్‌ బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌ పట్టా పొందిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం కార్తీక్.. ‘దోస్తానా 2’ ‘భూల్ భూలైయా 2’లలో నటిస్తున్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo