శుక్రవారం 14 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 10:45:35

గౌరవ డాక్టరేట్ ద‌క్కించుకున్న కాదంబ‌రి కిర‌ణ్‌

గౌరవ డాక్టరేట్ ద‌క్కించుకున్న కాదంబ‌రి కిర‌ణ్‌

మనం సైతం  అంటూ నిర్విరామంగా సేవాయజ్ఞం నిర్వహిస్తున్న 'కాదంబరి కిరణ్' కీగౌరవ డాక్టరేట్ చేరింది. 'మనం సైతం' వ్యవస్థాపకుడిగా... కాదంబరి అందిస్తున్న అద్వితీయ సేవలను గుర్తించి ఆయనకు ప్రతిష్టాత్మక  'గ్లోబల్ పీస్ యూనివర్సిటీ' వారు 'గౌరవ డాక్టరేట్' ప్రకటించారు.  పాత్రికేయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి... విలక్షణ నటుడిగా పేరు గడించిన కాదంబరి 'మనం సైతం' పేరుతో స్వచ్చంద సంస్థకు శ్రీకారం చుట్టి... నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు.  ముఖ్యంగా కరోనా క్లిష్ట కాలంలో కాదంబరి అందిస్తున్న సేవలు ఆయనకు మరింత పేరు తెచ్చిపెడుతున్నాయి.

కాదంబరికి 'గౌరవ డాక్టరేట్' ప్రకటన పట్ల పలువురు సినీ ప్రముఖులతోపాటు... రాజ్యసభ సభ్యులు-ప్రముఖ తెరాస యువనేత జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపినవారికి కృతజ్ఞతలు తెలిపిన కాదంబరి... ఈ డాక్టరేట్ తో తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నానని అన్నారు. డాక్టరేట్ ప్రదానకార్యక్రమం త్వరలోనే నిర్వహించనున్నామని 'గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ' ప్రతినిధి తెలిపారు!! 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo