శతాధిక చిత్రాల దర్శకుడనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు రాఘవేంద్రరావు ( K Raghavendra Rao ) . తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది సూపర్ స్టార్ యాక్టర్లను పరిచయం చేసిన ఘనత ఆయనది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెళ్లి సందడి. బహిరంగంగా ఎక్కువగా మాట్లాడకుండా తన సినిమాలతో అందరినీ పలుకరించే దర్శకేంద్రుడిని అందరూ మౌనమునిగా పేర్కొంటారు.
ఇన్నేళ్ల సినీకెరీర్‌లో మొదటి సారి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న పెళ్లి సందD సినిమాతో రాఘవేంద్రరావు యాక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో వశిష్ఠ ( Vashishta ) పాత్రలో కనిపించనున్నారు రాఘవేంద్రరావు. ఆయన పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. రాఘవేంద్రరావు స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని బాస్కెట్ బాల్ ఆడుతున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పెళ్లి సందDలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..