మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 17:03:54

బీహార్‌ బాలిక జ్యోతికుమారిపై ‘ఆత్మనిర్భర్’‌ సినిమా

బీహార్‌ బాలిక జ్యోతికుమారిపై ‘ఆత్మనిర్భర్’‌ సినిమా

పాట్నా: లాక్‌డౌన్‌ కాలంలో హర్యానాలో చిక్కుకున్న జ్యోతికుమారి గుర్‌గావ్‌ నుంచి తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని బీహార్‌లోని ఇంటికి చేరుకుంది. సుమారు 1200 కిలోమీటర్లు తన ప్రయాణాన్ని సాగించింది జ్యోతికుమారి. ఇపుడు జ్యోతికుమారి కథ సిల్వర్‌స్క్రీన్‌పైకి రానుంది.శైనే కృష్ణ ‘ఆత్మనిర్భర్’‌‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్నాడు.  గురుగ్రామ్‌ నుంచి దర్భాంగ వరకు జ్యోతికుమారి ప్రయాణంతోపాటు సమాజంలో ఉన్న సమస్యలను కూడా ఈ చిత్రంలో చూపించనున్నారు. టైటిల్‌ రోల్‌లో జ్యోతికుమారి నటిస్తుండటం విశేషం.

తన లైఫ్‌ స్టోరీ ఆధారంగా వస్తున్న సినిమాలో నటించడం సంతోషంగా ఉందని జ్యోతికుమారి చెప్పింది. హర్యానాలోని సికిందర్‌పూర్‌, గురుగ్రామ్‌ నుంచి దర్భాంగ వరకు పలు లొకేషన్లలో ఈ సినిమాను షూట్‌ చేయనున్నట్లు తెలిపారు. హిందీ, ఇంగ్లీష్‌, మైథిలీ భాషతోపాటు మరో 20 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శైనె కృష్ణ తెలిపారు. ఏ జర్నీ ఆఫ్‌ ఏ మైగ్రేంట్‌ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తామన్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన జ్యోతికుమారి ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని వేధించినా మానసిక ైస్థెర్యం కోల్పోకుండా..నడవలేని స్థితిలో ఉన్న తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1200 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. logo