శనివారం 06 జూన్ 2020
Cinema - May 22, 2020 , 09:06:28

చంద్ర‌ముఖి 2లో జ్యోతిక న‌టిస్తుందా ?

చంద్ర‌ముఖి 2లో జ్యోతిక న‌టిస్తుందా ?

2005లో విడుదలైన కామెడీ హ‌ర్రర్ ఫిలిం  చంద్ర‌ముఖి. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్‌, న‌య‌న‌తార, జ్యోతిక ముఖ్య పాత్ర‌లు పోషించారు. ముఖ్యంగా చిత్రంలో జ్యోతిక న‌ట‌న ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఫిదా అయ్యారు. గంగ పాత్ర‌లోను, చంద్ర‌ముఖిగాను జ్యోతిక త‌న న‌టవిశ్వ‌రూపం చూపించి అభిమానుల మ‌న‌స్సులు గెలుచుకుంది.

కొద్ది రోజుల క్రితం చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతోంది అనే విషయాన్ని స్యయంగా దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ప్రకటించాడు.కాగా చంద్రముఖీలో నటించిన జోతిక ఈ సీక్వెల్ లో నటిస్తుందా అనే దానిపై అంద‌రిలో అనుమానాలు ఉండ‌గా, తాజాగా దీనిపై స్పందించింది. ఈ ప్రాజెక్ట్ గురించి త‌న‌ను ఎవరు సంప్ర‌దించ‌లేద‌ని, చంద్ర‌ముఖి 2 గురించే త‌న‌కి తెలియ‌ద‌ని జ్యోతిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే జోతిక న‌టించిన  'పొన్‌మగళ్‌ వందాళ్‌'అనే చిత్రం త్వ‌ర‌లో ఓటీటీలో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. 


logo