శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 18:42:48

జస్ట్ నాలుగు కోట్లు డిమాండ్ చేశాడు అంతే..!

జస్ట్ నాలుగు కోట్లు డిమాండ్ చేశాడు అంతే..!

కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చి.. వాళ్ల ఆకలిని తీర్చిన మానవత్వం ఉన్న మనిషిగా అందరిచేత శభాష్ అనిపించుకున్న నటుడు సోనూసూద్. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు పారితోషికం విషయంలో షాక్ ఇస్తున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. గతంలో దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ అందుకున్న ఈ ప్రతి నాయకుడు ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.

ప్రస్తుతం బెల్లకొండ సాయి సినిమాలో చేస్తున్నాడు సోనూసూద్. అయితే తాజాగా బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమాలో బోయపాటి సోనూసూద్‌ను మెయిన్ విలన్‌గా తీసుకోవాలని అనుకున్నాడు. మొదట్లో ఈ పాత్ర కోసం సంజయ్‌దత్‌ను ఎంపిక చేసుకోవాలని అనుకున్నా.. ఇప్పుడు అతను అనారోగ్యంతో వుండటంతో సంజయ్ ప్లేస్‌లో సోనూను తీసుకోవాలని సంప్రదించారట. అయితే సోనూసూద్ మాత్రం జస్ట్ 4 కోట్లు అడగటంతో బోయపాటి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడట.