తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. అయినా ఇంకా వస్తూనే ఉన్నారు.. ఇప్పుడు మరో వారసుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఈ హీరో రానున్నాడు. తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ చంద్ర హీరోగా పరిచయం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మామ, ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు ఈయన. లక్ష్మీ ప్రణతికి స్వయాన తమ్ముడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అన్నమాట. ఈయన కోసం కథల ఎంపిక జరుగుతుంది.
నిజానికి తేజ దర్శకత్వంలో చిత్రం సీక్వెల్ తో నితిన్ చంద్ర ఎంట్రీ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు నితిన్ చంద్ర. ఈ మధ్యే నితిన్‌చంద్ర యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా నితిన్ చంద్ర కథలు వింటున్నాడని.. కథల ఎంపికలో జూనియర్ ఎన్టీఆర్ సలహాలు కూడా వింటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఒక కథ విన్న జూనియర్.. తన బావమరిదికి సరిపోతుందని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఆయన తండ్రి నార్నే శ్రీనివాసరావు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బావమరిదిని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. ఏ అవసరం వచ్చినా పక్కనే ఉంటాను కానీ.. కెరీర్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోమని సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా సరిగ్గా కథలు ఎంచుకోకపోతే నిలబడడం కష్టం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెళ్లి పీటలెక్కిన జబర్ధస్త్ కంటెస్టెంట్స్
ఓటీటీలో వెంకటేశ్ నారప్ప రిలీజ్.. ఎప్పుడంటే..
కాజల్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ఘనంగా శంకర్ కూతురి వివాహం.. హాజరైన సీఎం
‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నా: మంచు విష్ణు
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్