గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 20, 2020 , 17:29:40

వెబ్‌సిరీస్ తో 'జూనియ‌ర్ ఐష్' రీఎంట్రీ

వెబ్‌సిరీస్ తో 'జూనియ‌ర్ ఐష్' రీఎంట్రీ

ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ స్నేహాఉల్లాల్‌. ఆ తర్వాత క‌రెంట్‌, సింహాతోపాటు ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ 2015 త‌ర్వాత మ‌రే చిత్రంలో క‌నిపించ‌లేదు. తాజాగా స్నేహా ఉల్లాల్ సుదీర్ఘ విరామం త‌ర్వాత వెబ్‌సిరిస్ తో రీఎంట్రీ ఇస్తోంది. ఎక్స్‌పైరీ డేట్ టైటిల్ తో వ‌స్తోన్న ఈ వెబ్ సిరీస్ లో స్నేహాఉల్లాల్‌, మ‌ధుశాలిని, టోనీ ల్యూక్‌, అలీ రెజా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇద్దరు క‌పుల్స్ వివాహేత‌ర సంబంధాల నేప‌థ్యంలో వెబ్‌సిరీస్ కొన‌సాగ‌నుంది. 

ఎవ‌రు ఎవ‌రితో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఏర్ప‌డే ప‌రిణామాల నేప‌థ్యంలో త‌మ ప్ర‌త్య‌ర్థులపై ఎలా ప‌‌గ, ప్ర‌తీకారం, కోపం తీర్చుకున్నార‌నేది వెబ్ సిరీస్ లో చూడనున్నారు. జూనియ‌ర్ ఐశ్వ‌ర్యారాయ్ గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న స్నేహాఉల్లాల్ స‌రికొత్త క‌థాంశంతో కూడిన వెబ్‌సిరీస్ తో మంచి హిట్టు కొట్టాల‌ని భావిస్తోంది. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ మార్తాండ్ కే వెంక‌టేశ్ సోద‌రుడు శంక‌ర్ కే మార్తాండ్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. అక్టోబ‌ర్ 2న జీ5 యాప్ లో విడుద‌ల కానుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.