e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News ఆ విషయంలో ప్రభాస్‌ను టచ్ చేస్తున్న ఎన్టీఆర్..!

ఆ విషయంలో ప్రభాస్‌ను టచ్ చేస్తున్న ఎన్టీఆర్..!

ఆ విషయంలో ప్రభాస్‌ను టచ్ చేస్తున్న ఎన్టీఆర్..!

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మరో అనుమానం లేకుండా ప్రభాస్ అనే చెప్పాలేమో..? బాహుబలి సినిమాతోనే ప్ర‌భాస్ ఈ రేంజ్ కు వచ్చేసాడు. ఆ తర్వాత వచ్చిన సాహో తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో హిట్ అయింది. ఇవన్నీ పక్కనబెడితే రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ప్రభాస్ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈయన ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నాడు. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలకు భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు ప్రభాస్. తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీలోనే అగ్ర పారితోషికం తీసుకుంటున్నాడు ప్రభాస్.

ఇండియాలో కూడా ప్రభాస్ పారితోషికం స్థాయి మరే హీరోకు లేదేమో..? అక్షయ్ కుమార్ మాత్రమే ఆయనకు దగ్గర్లో ఉన్నాడు. సినిమాకు 98 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు అక్షయ్ కుమార్. ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీ నుంచే ప్రభాస్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. ఈయన కూడా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్నాడు. మొన్నటి వరకు సినిమాకు 30 కోట్ల వరకు అందుకున్న ఈయన ఇప్పుడు రెండింతలు పెంచేసాడని తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోవడం ఖాయం. అందుకే తన దర్శకులను కూడా అలాగే ఎంచుకుంటున్నాడు.

- Advertisement -

కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమాలకు 70 నుంచి 80 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే ప్రభాస్ ను కూడా అతి త్వరలోనే తారక్ రీచ్ కావడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. పైగా ఐదేళ్ళుగా ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత.. ఇలా వరస విజయాలు అందుకుంటున్నాడు. అందుకే తారక్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

రొమాంటిక్ గా ఫిల్హాల్‌ 2 మ్యూజిక్ వీడియో పోస్ట‌ర్

రాజమౌళి కథ చెప్తే..ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమ‌న్నాడంటే..?

మందు తాగ‌డం మానేసిన స్టార్ హీరో

‘మా’ ఎన్నిక‌లు..ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు వీళ్లే

సెట్‌లో స‌న్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్‌..వీడియో

‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్ర‌శ్న‌..వీడియో వైర‌ల్‌

మ‌రో బిజినెస్ వైపు స‌మంత అడుగులు..!

నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్

శ్రియా అందాల ఆర‌బోత..వీడియో హ‌ల్‌చ‌ల్‌

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ విషయంలో ప్రభాస్‌ను టచ్ చేస్తున్న ఎన్టీఆర్..!
ఆ విషయంలో ప్రభాస్‌ను టచ్ చేస్తున్న ఎన్టీఆర్..!
ఆ విషయంలో ప్రభాస్‌ను టచ్ చేస్తున్న ఎన్టీఆర్..!

ట్రెండింగ్‌

Advertisement