సోమవారం 25 మే 2020
Cinema - Feb 20, 2020 , 08:05:17

విజ‌య్ సినిమాలో ఎన్టీఆర్ సాంగ్‌..!

విజ‌య్ సినిమాలో ఎన్టీఆర్ సాంగ్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌లో ఒక్క న‌టుడే కాదు మంచి డ్యాన్స‌ర్ , సింగ‌ర్ కూడా ఉన్నారు. స‌మ‌యాన్ని బ‌ట్టి త‌న గొంతుతో అద్భుత‌మైన పాట‌లు ఆల‌పిస్తుంటారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘ఐ వాన ఫాలో యు’ అనే సాంగ్‌తో అభిమానుల‌ని ఎంత‌గానో అలరించాడు. ఎక్కువ‌గా త‌న సినిమాల‌లో పాట‌లు పాడే ఎన్టీఆర్ ఆ మ‌ధ్య  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సినిమా కోసం  ఓ పాట పాడాడు. ఇప్పుడు విజ‌య్ సినిమా కోసం మ‌రో సారి త‌న గొంతు స‌వ‌రించుకోనున్న‌ట్టు తెలుస్తుంది.

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ ‘కుట్టి స్టోరీ’ అనే పాట‌ని ఆల‌పించ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు, విజ‌య్ స్వ‌రం రెండు క‌ల‌వ‌డంతో పాట సోష‌ల్ మీడియాని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు ఇదే సాంగ్‌ని తెలుగులో ఎన్టీఆర్‌తో పాడించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. విజ‌య్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. చూడాలి మ‌రి విజ‌య్ సినిమాలో ఎన్టీఆర్ పాట అంటూ వ‌స్తున్న రూమ‌ర్స్‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. 


logo