శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 13:13:47

నువ్వు చాలా గొప్ప‌వాడివి అన్నా: ఎన్టీఆర్

నువ్వు చాలా గొప్ప‌వాడివి అన్నా: ఎన్టీఆర్

న‌టుడిగా, నిర్మాత‌గా రాణిస్తున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నేడు 43వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని అభిమానులు, సెల‌బ్రిటీలు క‌ళ్యాణ్ రామ్‌కి సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ సోద‌రుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అన్న‌కి గ్రేట్ విషెస్ అందించారు. సోద‌రుడిగానే కాకుండా నాకు స్నేహితుడిగా, దిశా నిర్దేశ‌కుడిగా, గైడ్‌గా ఉన్నావు. హ్యాపీ బ‌ర్త్‌డే క‌ళ్యాణ్ అన్నా.. నువ్వు చాలా గొప్ప‌వాడివి అంటూ రాసుకొచ్చాడు జూనియ‌ర్ .

నందమూరి తారకరామారావు నటవారసులుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ త‌మ‌దైన శైలిలో రాణిస్తున్నారు. ఎన్టీఆర్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉండ‌గా, క‌ళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 'బాలగోపాలుడు' సినిమాలో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత చేసిన 'అతనొక్కడే' 'లక్ష్మీ కళ్యాణం' 'పటాస్' సినిమాలు కళ్యాణ్ రామ్ కెరీర్ లో మంచి చిత్రాలుగా నిలిచిపోయాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo