గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 08:58:30

శృతి, జాన్వీ మ‌ధ్యలో ఎన్టీఆర్..!

శృతి, జాన్వీ మ‌ధ్యలో ఎన్టీఆర్..!

అర‌వింద స‌మేత త‌ర్వాత ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. చిత్రంలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కి అవకాశం ఉండ‌గా, అందులో జాన్వీ క‌పూర్, శృతి హాస‌న్‌ని ఎంపిక చేసిన‌ట్టు ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. గతంలో ఎన్టీఆర్, శ్రుతి హాసన్ కాంబినేషన్‌లో రామ‌య్యా వ‌స్తావ‌య్యా అనే చిత్రం తెర‌కెక్క‌గా ఈ సినిమా అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు. 

ఎన్టీఆర్ 30వ చిత్రంలో కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్.  నవంబర్ నుండి స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా జూన్ ఫస్ట్ వీక్ లో విడుదలకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ చిత్రంలో విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌నే టాక్ న‌డుస్తుంది. చూడాలి ఈ వార్త‌ల‌పై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో మ‌రి.


logo