బుధవారం 03 జూన్ 2020
Cinema - Feb 22, 2020 , 11:15:47

ఎన్టీఆర్ 30వ చిత్రంలో క‌థానాయిక ఎవ‌రంటే..!

ఎన్టీఆర్ 30వ చిత్రంలో క‌థానాయిక ఎవ‌రంటే..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మే వ‌ర‌కు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుండ‌గా, వెంట‌నే త‌న 30వ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్నాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇటీవల అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ఎన్టీఆర్‌తో జోడి క‌ట్టేది స‌మంత అని తెలుస్తుంది.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత అ..ఆ, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి, అత్తారింటికి దారేది  అనే చిత్రాలు చేయ‌గా, ఈ మూడు మంచి విజ‌యం సాధించాయి.  ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ర‌భ‌స‌, రామ‌య్య వ‌స్తావ‌య్యా, బృందావ‌నం, జ‌న‌తా గ్యారేజ్ అనే చిత్రాలు చేసింది.  ఈ చిత్రాలు కూడా మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. ఇటు త్రివిక్ర‌మ్ అటు ఎన్టీఆర్‌తో మంచి సినిమాలు చేసిన స‌మంత తాజా చిత్రంలో కూడా న‌టిస్తుంద‌నే వార్త‌ల‌లో ఎంత నిజ‌ముంద‌నేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. థ‌మ‌న్ సంగీతం అందించ‌నున్న ఈ చిత్రం 2021 స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానుంది. 


logo