బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 10:10:14

హ‌రికృష్ణ జ‌యంతి.. ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ ట్వీట్

హ‌రికృష్ణ జ‌యంతి.. ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ ట్వీట్

నటుడుగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్రవేశారు నంద‌మూరి హ‌రికృష్ణ‌.  చైత‌న్య‌ర‌ధ‌సార‌ధిగా, సౌమ్యుడిగా అంద‌రి హృద‌యాల‌లో శాశ్వ‌త స్థానాన్ని సంపాదించుకున్న హ‌రికృష్ణ 2018 ఆగస్టు 29న  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఆయ‌న మృతి నంద‌మూరి అభిమానుల‌తో పాటు ఫ్యామిలీకి తీర‌ని శోకాన్ని మిగిల్చింది.

ఈ రోజు హ‌రికృష్ణ 62వ జ‌యంతి కాగా, ఆయ‌న త‌న‌యులు క‌ళ్యాణ్ రామ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ఈ అస్థిత్వం మీరు, మీ వ్య‌క్తిత్వం మీరు. మొక్క‌వోని ధైర్యంతో కొన‌సాగే మా ఈ ప్ర‌స్థానానికి  నేతృత్వం మీరు. ఆజ‌న్మాంతం త‌ల‌చుకునే అశృక‌ణం మీరే అంటూ నంద‌మూరి హీరోలు త‌మ ట్వీట్‌లో తెలియ‌జేశారు.

కాగా, నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళుతుండగా హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. వెండితెర `సీత‌య్య‌`గా   ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో స్థిర‌మైన స్థానం సంపాదించుకున్నారు. 12 పైగా సినిమాల్లో మాత్ర‌మే న‌టించిన‌ప్ప‌టికీ... న‌టుడిగా ఆయ‌న ప్ర‌భావం మాత్రం ప్రేక్ష‌కుల‌పై బ‌లంగా ఉంటుంది. తొలిసారి త‌న తండ్రి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `శ్రీకృష్ణావ‌తారం`తో తెర‌పైకొచ్చారు హ‌రికృష్ణ‌.  త‌న తండ్రి క‌థానాయ‌కుడిగా న‌టించిన `దాన వీర శూర‌క‌ర్ణ‌`లో అర్జునుడిగా, నిర్మాత‌గా ప‌నిచేశారు. మ‌ళ్లీ హ‌రికృష్ణని న‌టుడిగా తెర‌పై చూసింది `శ్రీరాముల‌య్య‌` చిత్రంతోనే. `సీత‌య్య‌`, `టైగ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్‌`, `స్వామి`, `శ్రావ‌ణ‌మాసం` చిత్రాల్లో న‌టించారు.   


logo