విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలుగు తెరపై స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. రోజురోజుకు తనలోని నటనా పటిమను మెరుగు పరచుకుంటూ ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ఈ సినిమా తర్వాత తన 30వ సినిమాని కొరటాల శివతో చేయనున్నాడు. 31వ సినిమాని ప్రశాంత్ నీల్తో చేయనున్నట్టు తెలుస్తుంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిందో, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ కూడా అలా పెరుగుతుందంటున్నారు విశ్లేషకులు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే ఎన్టీఆర్కు హిందీలో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ‘రామ్ లీల’,‘భాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ ఇప్పుడు ఆలియాబట్తో గంగూబాయ్ కతియావాడి సినిమా చేస్తున్నబాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఎన్టీఆర్ 32వ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందనేది రానున్న రోజులలో తేలనుంది.