సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 10:24:48

ఎన్టీఆర్ భ‌ర‌త‌నాట్యం వీడియో వైర‌ల్‌

ఎన్టీఆర్ భ‌ర‌త‌నాట్యం వీడియో వైర‌ల్‌

టాలీవుడ్‌లో చిరంజీవి త‌ర్వాత ప్రేక్ష‌కుల‌ని త‌న డ్యాన్స్‌తో మెప్పించిన స్టార్ జూనియ‌ర్ ఎన్టీఆర్ అని చెప్ప‌వ‌చ్చు. హీరోయిన్స్ కూడా కొన్ని సంద‌ర్భాల‌లో ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయ‌డం చాలా క‌ష్టం అని చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. చిన్న‌ప్పుడు భ‌ర‌త‌నాట్యంలో శిక్ష‌ణ పొందిన ఎన్టీఆర్ ఎలాంటి డ్యాన్స్‌ల‌నైన అవ‌లీల‌గా వేస్తాడు. బాలీవుడ్ స్టార్  హృతిక్ రోషన్ కూడా ఓ టైమ్లో జూనియర్ డాన్స్ గురించి ప్రస్తావించాడం విశేషం 

చిన్నవయసు నుండే డాన్స్ మీద అమితమైన ఆసక్తితో తల్లి శాలిని ప్రోత్సాహంతో నృత్యకళలో శిక్షణ తీసుకున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. టీనేజ్ లో ఉన్నపుడు ఎన్టీఆర్ చేసిన భరతనాట్యం పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ డ్యాన్స్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తుంది. ‌బాల  రామాయ‌ణం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఎన్టీఆర్‌..నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగ‌తి తెలిసిందే. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్   డోన్‌లోడ్ చేసుకోండి.


logo