ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 18, 2021 , 11:43:29

దొర‌స్వామి మృతికి ఎన్టీఆర్ సంతాపం

దొర‌స్వామి మృతికి ఎన్టీఆర్ సంతాపం

నిర్మాత‌గా, పంపిణీదారుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో సేవ‌లు అందించిన  దొర‌స్వామి ఈ రోజు ఉద‌యం వ‌యోభారం కార‌ణంగా క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సింహాద్రి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన దొర‌స్వామి ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో యంగ్ టైగ‌ర్ దిగ్భ్రాంతికి గుర‌య్యారు. త‌న ట్విట్ట‌ర్ ద్వారా దొర‌స్వామికి సంతాపం తెలియ‌జేశారు.

దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘ‌వేంద్ర‌రావు కూడా దొర‌స్వామికి  సంతాపం తెలియ‌జేశారు. 

VIDEOS

logo