శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Feb 10, 2020 , 13:25:36

జోక‌ర్‌ను తీర్చిదిద్దిన హిల్ద‌ర్ మ్యూజిక్‌..

జోక‌ర్‌ను తీర్చిదిద్దిన హిల్ద‌ర్ మ్యూజిక్‌..

హైద‌రాబాద్‌:  ఐస్‌ల్యాండ్‌కు చెందిన హిల్ద‌ర్ గున‌డొటైర్‌.. ఆస్కార్స్‌లో ఈ యేటి ఉత్త‌మ మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌ అవార్డును గెలుచుకున్న‌ది.  జోక‌ర్ చిత్రానికి ఆమె బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌  కంపోజ్ చేసింది.  ఒరిజిన‌ల్ స్కోర్ క్యాట‌గిరీలో హిల్డ‌ర్ ఆస్కార్ గెల‌వ‌డం విశేషం.  ఈ  కేట‌గిరీలో ఒంట‌రిగా ఆ అవార్డును అందుకున్న తొలి మ‌హిళా మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌గా హిల్డ‌ర్ కీర్తికెక్కింది.  గ‌డిచిన అయిదు నెల‌ల్లోనే ఆమె వ‌రుస‌గా ప‌లు అవార్డుల‌ను అందుకున్న‌ది.  గ్రామీ, ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్‌, బాఫ్టా లాంటి అవార్డులు కూడా ఆమెను వ‌రించాయి.  అవార్డును అందుకున్న హిల్ద‌ర్‌.. ఎంతో భావోద్వేగానికి లోనైంది.  జోక‌ర్ పాత్ర పోషించిన జాక్విన్ ఫీనిక్స్‌కు ఉత్త‌మ న‌టుడు అవార్డు ద‌క్కింది. ఈ సినిమాను టెడ్ ఫిలిప్స్ డైర‌క్ట‌ర్ చేశారు.

ఈ సినిమాలో క్లౌన్ పాత్ర పోషించిన జాక్విన్‌.. త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఆ స‌న్నివేశాల‌కు హిల్డ‌ర్ అందించిన మ్యూజిక్ మ‌రో హైలెట్‌.  జాక్విన్ న‌ట‌నా కౌశ‌ల్యాన్ని మ‌రింత హెచ్చు స్థాయికి తీసుకువెళ్లింది ఈ సినిమాలోని మ్యూజిక్‌. అమాయ‌కుడిగా ఉన్న హీరో.. కొన్ని మ‌లుపుల‌తో క్రూరంగా మారుతాడు. ఆర్థ‌ర్ ఫ్లెక్ రోల్‌లో జాక్విన్ అల్లాడించారు. అయితే ఆ క్యారెక్ట‌ర్‌కు జీవం పోసింది మాత్రం మ్యూజిక్ అన‌డంలో సందేహం లేదు.  చాలా వికృత‌మైన భావోద్వేగాల‌ను హీరో ప్ర‌జెంట్ చేస్తున్న స‌మ‌యంలో.. ఆ న‌టన‌కు మ‌రింత క్రూర‌త్వాన్ని ఇచ్చే విధంగా కొన్ని స‌న్నివేశాల్లో మ్యూజిక్ ఉంటుంది.  కొన్ని కొన్ని స‌న్నివేశాల్లో వ‌చ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. హీరో మంచిత‌నాన్ని కూడా అదే రేంజ్‌లో ప్ర‌జెంట్ చేస్తుంది. త‌న క్యారెక్ట‌ర్ రూప‌క‌ల్ప‌న‌లో మ్యూజిక్ కీల‌కంగా నిలిచింద‌ని ఉత్త‌మ హీరో అవార్డు గెలుచుకున్న జాక్విన్ కూడా చెప్పారు. జోక‌ర్ ఫిల్మ్‌కు హిల్ద‌ర్ ఇచ్చిన మ్యూజిక్ ఓ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తోంది.


logo