శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 15:55:51

'స‌త్యమేవ జ‌యతే 2 ' షూటింగ్ షురూ

 'స‌త్యమేవ జ‌యతే 2 ' షూటింగ్ షురూ

జాన్అబ్రహాం లీడ్ రోల్ లో తెర‌కెక్కిన చిత్రం స‌త్య‌మేవ జ‌య‌తే. 2018లో వ‌చ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా స‌త్యమేవ జ‌యతే 2 వ‌స్తోన్న విషయం తెలిసిందే.  మిలాప్ జ‌వేరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో దివ్యాఖోస్లా కుమార్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ చిత్ర‌షూటింగ్ నేడు ల‌క్నోలో షురూ అయింది. తొలి స‌న్నివేశాల‌ను జాన్ అబ్ర‌హాం, దివ్యా ఖోస్లాపై షూట్ చేశారు. జాన్ అబ్ర‌హాం వైట్ కుర్తా, గ్రే బంధ్‌గాలా జాకెట్ వేసుకోగా..జేబుపై జాతీయ ప‌తాకాన్ని స్టిక‌ర్ అతికించుకున్నాడు. దివ్యా ఖోస్లా రెడ్ బార్డ‌ర్ ఉన్న వైట్ సారీలో మెరిసిపోతుంది. 

భూష‌ణ్ కుమార్, నిఖిల్ అద్వానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌క్నోలోని చారిత్ర‌క ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ కొన‌సాగ‌నున్న‌ట్టు జ‌వేరి వెల్ల‌డించారు న‌టీన‌టులు హ‌ర్ష్ ఛాయ‌, అనూప్ సోని, గౌత‌మి క‌పూర్, షాద్ రాంధ‌వా, సాహిల్ వాయిద్ షూటింగ్ లో పాల్గొననున్నారు. ల‌క్నో వీధుల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను షూట్ చేస్తామ‌ని ఇప్ప‌టికే మిలాప్ జ‌వేరి తెలిపారు. 2021 జ‌న‌వ‌రి వ‌ర‌కు షూటింగ్ కొన‌సాగనుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.