రూహీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ భామ జాన్వీకపూర్. సినిమా షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపిన జాన్వీకపూర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో సరదాగా చక్కర్లు కొడుతోంది.
జాన్వీకపూర్ తోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. జాన్వీకపూర్ ఓ అబ్బాయితో కలిసి సముద్ర ఒడ్డున ఉన్న రాళ్లపై కూర్చున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకీ జాన్వీకపూర్ పక్కనున్న వ్యక్తి ఎవరనే కదా మీ డౌటు. అతడి పేరు రోహన్ జారా. జాన్వీకపూర్ స్నేహితుడు. రోహన్ది కాలిఫోర్నియాలోని మాలిబు ప్రాంతం.
జాన్వీ వెంట సోదరి ఖుషీ కపూర్ కూడా వెకేషన్ కు వెళ్లింది.
లిలాక్ స్ట్రాపీ టాప్, లావెండర్ ట్రౌజర్లో ఉన్న జాన్వీకపూర్ రాళ్లపై రోహన్ తో కూర్చొని కెమెరాకు పోజులిచ్చింది.
ఇది ఒక నిమిషం లాస్ ఏంజెల్స్ లా ఉంది. కానీ మీరు దీన్ని ఇప్పటికీ ఇల్లులా భావిస్తారు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.