బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 11, 2020 , 08:13:39

ఉత్సాహంగా స్టెప్పులేసిన జాన్వీ.. ఫిదా అయిన ఫ్యాన్స్

ఉత్సాహంగా స్టెప్పులేసిన జాన్వీ.. ఫిదా అయిన ఫ్యాన్స్

శ్రీదేవి కూతురిగా వెండితెరకి పరిచయం అయిన జాన్వీ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ధడక్ చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ ప్రస్తుతం గుంజన్‌ సక్సేన్‌ ది కార్గిల్‌ గార్ల్‌ అనే చిత్రంతో బిజీగా ఉంది. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 24న విడుదల కానుంది. కాగా, రూహీ ఆఫ్జాన్‌, దోస్తానా 2 అనే చిత్రాలు కూడా చేస్తున్న జాన్వీ తాజాగా నాసిక్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేజ్‌పై ధడక్‌ సినిమాలోని జింగాత్‌ .. అనే పాటకి హుషారుగా స్టెప్పులేశారు . జాన్వీ స్టెప్పులకి మైమ‌ర‌చిని  అభిమానులు కేరింతలు  వేస్తూ తెగ గోల‌లు చేశారు . ప్ర‌స్తుతం జాన్వీకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతుంది. 
logo