బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 31, 2020 , 14:31:39

ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయ‌నున్న జాన్వీ క‌పూర్..!

ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయ‌నున్న జాన్వీ క‌పూర్..!

శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ ద‌ఢ‌ఖ్ చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌లు హిందీ సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు తెలుగు తెర‌పై ఎప్పుడు మెరుస్తుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా గ‌మినిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం ఫైట‌ర్‌తో జాన్వీ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ, అది పుకారుగానే మిగిలింది. ఇక తాజాగా ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో జాన్వీ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని అంటున్నారు.

ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అర‌వింద స‌మేత మంచి హిట్ కావ‌డంతో ఇప్పుడు మ‌రోసారి వీర‌ద్ద‌రు క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయిన‌ను పోయిరావాలె హ‌స్తిన‌కు అనే టైటిల్‌తో చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా,  ఇందులో ఒక క‌థానాయిక‌గా పూజా హెగ్డేని, మ‌రో క‌థానాయిక‌గా జాన్వీ క‌పూర్‌ని అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే జాన్వీతో సంప్ర‌దింపులు కూడా జ‌రిగాయ‌ని త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టాక్.
logo