బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Feb 15, 2020 , 23:26:52

అంతా అమ్మదీవెన

అంతా అమ్మదీవెన

సీనియర్‌ కథానాయిక ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గురవయ్యలు నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత ఆమని మళ్లీ సినిమాల్లో బిజీ అవడం ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో స్త్రీ ప్రధాన పాత్రల సినిమాలు పెరగాల్సిన అవసరం వుంది. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. ‘అమ్మ దీవెన’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. బాధ్యత లేని భర్తతో ఓ భార్య ఐదుగురు పిల్లల్ని అన్నీ తానై ఎలా ప్రయోజకుల్ని చేసింది అనేది ఈ చిత్ర కథాంశమని నిర్మాతలు తెలిపారు.