గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 12:53:46

మెరుగుప‌డుతున్న రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం..!

మెరుగుప‌డుతున్న రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కొద్ది రోజుల క్రితం క‌రోనాతో హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంట‌ర్ ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. నిపుణులైన వైద్యులు ఆయ‌న‌కు ప‌త్యేక వైద్యం అందిస్తుండ‌గా, ఆయ‌న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. హెల్త్ బులిటెన్స్ లోను రాజ‌శేఖ‌ర్ చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని చెప్ప‌డంతో అభిమానుల‌లో కొంత ఆందోళ‌న త‌గ్గింది.

తాజాగా జీవితా రాజ‌శేఖ‌ర్ త‌న భ‌ర్త గురించి మాట్లాడుతూ..ఆయ‌న  ఆరోగ్యం మెరుగవుతుంది.  వైరస్ వల్ల  శ‌రీరంలో కలిగిన ఇన్ఫెక్షన్ తగ్గింది . పలు పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేయ‌నున్నార‌ని జీవితా పేర్కొన్నారు.  కాగా, రాజ‌శేఖ‌ర్ క‌రోనాని జ‌యించి రావాల‌ని అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్రార్ధ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.