మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు తెలుగు చిత్రసీమలో ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్షపదవి బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు నిలవబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ రేసులోకి సీనియర్ నటి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఆమె సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్ అధ్యక్షబరిలో నిలవబోతున్నారనే వార్తలు తెలుగు చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారాయి. సెప్టెంబర్‌లో ‘మా’ ఎన్నికలు జరుగనున్నాయి. ఇంకా మూడు నెలలు సమయం ఉండగానే తెలుగు పరిశ్రమలో ‘మా’ ఎన్నికలు అనేక మలుపులతో ఆసక్తికరంగా మారుతున్నాయి.