ఆదివారం 31 మే 2020
Cinema - May 04, 2020 , 18:13:19

చిరంజీవి గురించి జేడీ బ‌హిరంగ లేఖ‌

చిరంజీవి గురించి జేడీ బ‌హిరంగ లేఖ‌

ఒక‌ప్పుడు యూత్ హీరోల‌కి ఐకాన్‌గా మారిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి రీసెంట్‌గా చిరంజీవికి బ‌హిరంగ లేఖ రాసారు. ఇందులో ఆయ‌న చిరంజీవి సేవ‌ల‌ని కొనియాడుతూ .. మిమ‌ల్ని మెగాస్టార్ అనలేం.. గొప్ప వ్యక్తిగా అభివర్ణించాలి అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.  ప్ర‌స్తుతం ఈ లేఖ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివ‌రాలలోకి వెళితే.. క‌రోనా సంక్ష‌భం వ‌ల‌న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో రోజువారి వేత‌నం పొందే కార్మికులు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. వారి జీవితాలు అగ‌మ్య‌గోచ‌రంగా మారాయి. ఇలాంటి ప‌రిస్థితుల‌లో చిరంజీవి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌తో క‌లిసి కరోనా క్రైసిస్ ఛారిటీ మ‌న‌కోసంని ఏర్పాటు చేసి సినీ కార్మికుల జీవితాల‌లో కొంత వెలుగు నింపారు.

ఈ నేప‌థ్యంలో చిరంజీవికి  కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ జేడీ చ‌క్ర‌వ‌ర్తి లేఖ రాశారు. ముందుగా ప్రియ‌మైన చిరంజీవి గారు అంటూ మొద‌లు పెట్టిన జేడీ.. అనేక విష‌యాలు ప్ర‌స్తావించారు. నేను మీ అభిమానిని. అనుచ‌రుడిని కాదు. న‌టుడిగా మాత్ర‌మే మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డ్డాను. నా తోటి న‌టులంతా మీతో క‌లిసి చ‌క్క‌గా కాల‌క్షేపం చేసేవారు. సాయంత్రం వేళ‌ల్లో మీతో స‌మ‌యం గ‌డ‌ప‌డానికి ఆస‌క్తి చూపేవారు. కాని నాకెప్పుడు అలా చేయాల‌నిపించ‌లేదు. ఇది మీకు నేను రాస్తున్న బ‌హిరంగ లేఖ అంటూ లేఖలో ప‌లు అంశాలు ప్ర‌స్తావించారు జేడీ చ‌క్ర‌వ‌ర్తి .

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేసింది. ముఖ్యంగా క‌రోనా వ‌ల‌న సినిమా ప‌రిశ్ర‌మ కుదేలైంది. సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇలాంటి ప‌రిస్తితుల‌లో మీతో పాటు నేను కూడా ఆర్ధిక ఇబ్బందుల‌ని ఎదుర్కొంటున్నాం. అయితే ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో మీరు పెద్ద మ‌న‌సు చేసుకొని సినీ కార్మికుల‌కి సాయం అందించ‌డం అభినంద‌నీయం.  మీరు చేస్తున్న ప‌ని చూస్తుంటే మిమ్మల్ని మెగాస్టార్ అనలేం.. గొప్ప వ్యక్తిగా అభివర్ణించాలి.

అభిమానులే కాదు ప్ర‌తి ఒక్క‌రు మిమ్మ‌ల్నిఎందుకు అంత‌గా ఇష్ట‌ప‌డుతున్నారో మీరు చేసే ఈ ప‌నులే నిద‌ర్శ‌నం. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికులు నాకు ఫోన్ చేసి మా కుటుంబాల‌కి ఎలాంటి ఆక‌లి స‌మ‌స్య‌లు లేవ‌ని, వారికి కావ‌ల‌సినంత నిత్యావ‌స‌ర అంద‌జేశార‌ని తెలిపారు. మీరు ఇండ‌స్ట్రీ రుణం తీర్చుకుంటున్నాన‌ని  అంటున్నారు కానీ కార్మికుల ప‌ట్ల అది మీకున్న గౌర‌వంగా భావిస్తున్నాను. గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మీకు నేను అభిమానిని, అనుచురుడిని, మిమ్మ‌ల్ని అమితంగా ఇష్ట‌ప‌డిన వ్య‌క్తిని. లాక్‌డౌన్ లేక‌పోతే మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డానికి వ‌చ్చేవాడిని. మంచి వ్య‌క్తిగా మారాలానే విష‌యాన్ని మీ ద‌గ్గ‌ర నుండి నేర్చుకోవాలి త‌న జేడీ చ‌క్ర‌వ‌ర్తి  లేఖ‌లో పేర్కొన్నారు.


logo