మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 02:35:57

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌‌లో జయప్రకాశ్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌‌లో  జయప్రకాశ్‌

దేశంలో కేరళ తర్వాత అత్యంత అద్భుతమైన ఆహ్లాదకర వాతావరణం హైదరాబాద్‌లోనే ఉంటుందన్నారు నటుడు జయప్రకాశ్‌. ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో బుధవారం జయప్రకాశ్‌ పాల్గొన్నారు.  శత్రు ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించిన ఆయన మాదాపూర్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జయప్రకాశ్‌ మాట్లాడుతూ...ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. షూటింగ్‌ల కోసం వివిధ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తుంటానని, కేరళ తర్వాత హైదరాబాద్‌లోనే పచ్చదనం కనిపిస్తుందన్నారు. పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పచ్చదనాన్ని పెంచే అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న ఎంపీ  సంతోష్‌కుమార్‌ను జయప్రకాశ్‌ అభినందించారు.