సోమవారం 18 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 08:55:02

సీనియ‌ర్ న‌టి ఇంట్లో విషాదం..!

సీనియ‌ర్ న‌టి ఇంట్లో విషాదం..!

న‌టి, ద‌ర్శ‌కనిర్మాత జ‌య‌చిత్ర  ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె భ‌ర్త గ‌ణేష్‌(62) తిరుచ్చిలో గుండెపోటుతో క‌న్ను ‌మూశారు. 1983లో గ‌ణేష్‌ని వివాహం చేసుకోగా, ఈ దంపతుల సంతానమే యువ సంగీత దర్శకుడు అమ్రేష్.  గణేశ్‌ నటుడిగా ఓ చిత్రంలో నటించారు. శ‌నివారం గ‌ణేష్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నుండ‌గా ఆయ‌న‌ని క‌డ‌సారి చూసేందుకు జ‌య‌చిత్ర అభిమానులు భారీగా రానున్నార‌ని తెలుస్తుంది.

గ‌ణేష్ భౌతికకాయాన్ని చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌లో ఉంచ‌గా, ఆయ‌న   పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. జ‌య‌చిత్ర తెలుగునాట జన్మించినా తమిళనాడులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ భాషల‌లో 200కి పైగా చిత్రాల‌లో న‌టించింది జ‌యచిత్ర‌