శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 08:49:08

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి సినీరంగ‌ ప‌రిచ‌యం ..

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి సినీరంగ‌ ప‌రిచ‌యం ..

విల‌న్‌గా, క‌మెడీయ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్న  జయప్రకాశ్ రెడ్డి(74) హ‌ఠాన్మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న మ‌ర‌ణ విషయం తెలుసుకున్న అభిమానులు శోక‌సంద్రంలో మునిగారు. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. కుర్ర హీరోల‌తో పాటు సీనియ‌ర్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసిన జ‌యప్ర‌కాశ్ రెడ్డి చివ‌రిగా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో క‌నిపించారు.   

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి స్వ‌స్థ‌లం కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయ‌న  తండ్రి సాంబిరెడ్డియాదృచ్ఛిక పేజీ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. 

జ‌య ప్ర‌కాశ్ రెడ్డి తండ్రి కూడా న‌టుడే కాబ‌ట్టి కొడుకుని ఎంత‌గానో ఎంక‌రేజ్ చేసేవారు. ఇద్ద‌రు క‌లిసి ప‌లు నాట‌కాలు కూడా చేశారు. చ‌దువులోను చుర‌కుగా ఉండే జ‌య‌ప్ర‌కాశ్  డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. అయితే త‌ను చ‌దుకునే స‌మ‌యంలో ఆయ‌న స్నేహితుడు ఇతడి స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశారు.  ఈ విష‌యంపై ఫైర్ అయిన టీచ‌ర్    ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. ఇక్క‌డ కాస్త ఫీలైన జ‌య‌ప్ర‌కాశ్  నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు.

నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్న స‌మ‌యంలో జ‌య‌ప్ర‌కాశ్ న‌ట‌న  దాసరి నారాయణరావుకు ఎంత‌గానో న‌చ్చింది. వెంట‌నే రామానాయుడుకు ప‌రిచ‌యం చేశారు. 1988లో విడుదలైన బ్ర‌హ్మ‌పుత్రుడు చిత్రంలో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు.  1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు వ‌చ్చింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. 

విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాశ్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ ‘అలెగ్జాండర్’(ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్‌) పేరుతో ఓ సినిమాను కూడా నిర్మించారు. రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి చెప్పే డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌కి మ‌రింత వినోదాన్ని అందిస్తుంటుంది. జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, నిజం, ఛత్రపతి, సీతయ్య, విక్రమార్కుడు, పలనాటి బ్రహ్మనాయుడు, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, సుప్రీమ్, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్ వంటి చిత్రాల‌లో న‌టించిన జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇక మ‌న మ‌ధ్య లేర‌నే వార్తతో వార్త తెలిసి టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని సినీ ప్ర‌ముఖులు, అభిమానులు ప్రార్ధిస్తున్నారు.