శుక్రవారం 03 జూలై 2020
Cinema - Jan 28, 2020 , 14:09:33

ప్ర‌భాస్ సాహో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న జ‌ప‌నీస్‌

ప్ర‌భాస్ సాహో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న జ‌ప‌నీస్‌

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లు ఇందులోని న‌టీన‌టుల‌కి ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌భాస్‌, రానాతో పాటు సుబ్బ‌రాజు కూడా జ‌ప‌నీస్ ఆద‌రాభిమాననాలు అందుకున్నారు. వీరి బ‌ర్త్‌డేల‌ని వారు పండుగ‌లా జ‌రుపుకుంటున్నారంటే జ‌పాన్ వాసుల‌కి వీరిపై ఎంత ప్రేమ‌, అభిమానం ఉన్నాయో అర్దం చేసుకోవ‌చ్చు. అయితే బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సినిమాల కోసం జ‌పాన్ వాసులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్ర‌భాస్ ఇటీవ‌ల న‌టించిన సాహో చిత్రం జ‌ప‌నీస్ వ‌ర్షెన్ సోమవారం జ‌పాన్‌లోని కొన్ని సెల‌క్టెడ్ థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. సినిమా ఆడియో తెలుగులో వ‌స్తుండ‌గా, స‌బ్‌టైటిల్స్ మాత్రం జ‌పాన్ భాష‌లో ఉన్నాయి. ప్ర‌భాస్‌ని స్క్రీన్‌పై చూసిన అక్క‌డి ఫ్యాన్స్ ఈల‌లు, గోలలతో థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లేలా చేశారు. సాహోని వారు ఫుల్‌గా ఎంజాయ్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే జ‌పాన్‌లో బాహుబ‌లి సాధించినంత స‌క్సెస్ సాహో అందుకోగ‌ల‌దా అన్న‌ది చూడాలి..!


logo