సోమవారం 25 మే 2020
Cinema - Mar 30, 2020 , 09:49:59

క‌రోనాతో క‌మెడీయ‌న్ మృతి

క‌రోనాతో క‌మెడీయ‌న్ మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి ఎన్నో వేల మంది ప్ర‌జ‌ల‌ని పొట్ట‌న పెట్టుకుంటుంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా క‌రోనా బారిన ప‌డుతున్నారు. కొంద‌రు క‌రోనా నుండి త్వ‌ర‌గానే కోలుకుంటున్న‌ప్ప‌టికీ మ‌రి కొంద‌రు మృత్యువాత ప‌డుతున్నారు.  61 ఏళ్ల ప్ర‌ముఖ సింగ‌ర్ జో డిఫీ క‌రోనా వ‌ల‌న మ‌ర‌ణించ‌గా, ఇప్పుడు జ‌ప‌నీస్ క‌మెడీయ‌న్ కెన్‌ షిమురా మృత్యువాత ప‌డ‌డం అంద‌రిని ఆందోళ‌న క‌లిగిస్తుంది. 

కొద్ది రోజుల క్రితం కరోనా వ‌ల‌న కెన్ షెమురా(70) ఆసుప‌త్రిలో అడ్మిట్ కాగా, ప‌రిస్థితి విషమించ‌డంతో క‌న్నుమూశారు. వైర‌స్ వ‌ల‌న మ‌ర‌ణించిన తొలి జ‌పాన్ సెల‌బ్రిటీ ఇత‌నే. ఆదివారం అత‌ను మ‌ర‌ణించ‌గా, ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. జ‌పాన్‌కి చెందిన బెస్ట్ క‌మెడీయ‌న్స్‌లో షిమురా ఒక‌రు. 1970,80 కాలంలో ఆయ‌న క‌మెడీయ‌న్‌గా ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రించారు.  కొంత కాలంగా  ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌తో భాద‌ప‌డుతున్న కెన్ 2016లో స‌ర్జ‌రీ చేయించుకున్నారు. ఇక‌ మార్చి 19న  కెన్‌ షిమురా తీవ్ర జ్వ‌రంతో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయినట్టు మీడియా చెబుతుంది. కెన్ మృతిపై అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆదివారం జ‌పాన్ లో 68 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 1800 మంది క‌రోనాతో బాధ‌ప‌డుతున్నారు. 55 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు.  


logo