కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిఫలం తప్పక వస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రముఖులుగా ఉన్న వారందరు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా ఎంతో కష్టపడి కొరియోగ్రాఫర్‌గా మారాడు. ఇప్పుడు దర్శక దిగ్గజం శంకర్ -రామ్ చరణ్ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా ఎంపిక కావడంతో ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు.తన ట్విట్టర్లో శంకర్‌తో దిగిన ఫొటో షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.
డైరెక్టర్ శంకర్ తీసిన ప్రేమికుడు చిత్రంలోని ముకాబులా పాటకు స్టేజ్ పరాఫార్మర్గా నా ప్రయాణం మొదలైంది. బాయ్స్ సినిమాలో 500 మంది బ్యాకప్ డ్యాన్సర్స్‌లో ఒకరిగా పని చేశాను. ఇప్పుడు శంకర్ సినిమాలో అది కూడా నా ఫేవరేట్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా పని చేసే అవకాశం రావడం నిజంగా షాకింగ్ గా ఉంది. నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు రామ్‌చరణ్‌కు, నిర్మాత దిల్ రాజుకు సర్వదా కృతజ్ఞుడిని” అని జానీ మాస్టర్ ట్వీట్ చేశాడు.