సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 19:03:23

జేమ్స్ బాండ్ పాత్ర‌ధారి సీన్ కాన‌రీ మృతి

జేమ్స్ బాండ్ పాత్ర‌ధారి సీన్ కాన‌రీ మృతి

వాషింగ్ట‌న్‌: హాలీవుడ్‌కు చెందిన‌‌ ప్రముఖ నటుడు, జేమ్స్‌ బాండ్‌ పాత్రధారి సీన్‌ కానరీ (90) మృతిచెందారు. ఈ విష‌యాన్ని యునైటెడ్ కింగ్‌డ‌మ్‌కు చెందిన మీడియా స్ప‌ష్టంచేసింది. 1962లో విడుదలయిన ‘డాక్టర్‌ నో’ సినిమాతో సీన్‌‌ కానరీ తొలిసారి జేమ్స్‌ బాండ్‌గా కనిపించారు. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో కూడా జేమ్స్‌బాండ్ పాత్ర‌ధారిగా న‌టించారు. ‘ఫ్రమ్‌ రష్య విత్‌ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్‌ ట్వైస్, డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’ సినిమాల్లో కాన‌రీ జేమ్స్‌ బాండ్‌గా కనిపించారు. 

ఆ తర్వాత ‘ఆన్‌ హర్‌ మెజెస్టిక్‌ సీక్రెట్‌ సర్వీస్‌’ సినిమా నుంచి జార్జ్‌ లెజెన్బీ జేమ్స్‌ బాండ్‌గా న‌టిస్తున్నారు. మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌. జేమ్స్‌ బాండ్ ఈ పంచ్‌ డైలాగ్‌ను సుమారు 58 ఏండ్లుగా వింటూనే ఉన్నాం. అంతేకాదు, ఇప్పటికీ జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకు పాపులారిటీ అలాగే ఉన్న‌ది. అందుకే బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007 అంటూ పిల్ల‌లు ఇప్ప‌టికీ ఆ పాత్రతో తమను పోల్చుకుంటూ ఉంటారు. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రినీ ఆకట్టుకుంటాయి. ( చూడండి..మోతాదు మించితే విషమే.. వీడియో )


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.