బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 14:58:10

నో టైమ్ టు డై.. మ‌ళ్లీ వాయిదా

నో టైమ్ టు డై.. మ‌ళ్లీ వాయిదా

లాస్ ఏంజిల్స్ : జేమ్స్ బాండ్ సినిమా 'నో టైమ్ టు డై' మ‌ళ్లీ వాయిదా ప‌డింది. కోవిడ్ వ‌ల్ల ఆ సినిమాను ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.  వాస్త‌వానికి గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అయితే క‌రోనా నుంచి ఇంకా థియేట‌ర్లు కోలుకోలేద‌ని, అందుకే ఆ మూవీని వాయిదా వేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.  ఈ ఏడాది అక్టోబ‌ర్ 8వ తేదీన 'నో టైమ్ టు డై'ని రిలీజ్ చేయ‌నున్నారు.   ఎంజీఎం, కామ్‌కాస్ట్ కార్ప్స్ యూనివ‌ర్స‌ల్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. గ‌త ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమాను మొద‌ట న‌వంబ‌ర్‌కు వాయిదా వేశారు. క‌రోనా వ‌ల్ల మ‌ళ్లీ 2021 ఏప్రిల్‌కు వాయిదా వేశారు. సుమారు 200 మిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌ర్చుతో సినిమాను రూపొందించారు. బ్రిటీష్ ఏజెంట్ పాత్ర‌లో డానియ‌ల్ క్రేగ్ న‌టిస్తున్నాడు. 


VIDEOS

logo