ఆస్కార్‌కు జల్లికట్టు

గత ఏడాది మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న ‘జల్లికట్టు’ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. జోసే పెల్లిస్సరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 93వ ఆస్కార్ పురస్కారాల్లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి పోటీపడబోతున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆస్కార్ నామినేషన్ కోసం హిందీ, మలయాళం, మరాఠీతో పాటు ఇతర భాషల నుంచి 27 సినిమాలు పరిశీలనకు రాగా వాటిలో నుంచి ‘జల్లికట్టు’ను ఎంపికచేసినట్లు ఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చైర్మన్ రాహుల్ రవైల్ పేర్కొన్నారు. మనుషుల్లోని పశుప్రవృత్తిని వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ కీలక పాత్రల్ని పోషించారు.చపాక్, శకుంతలాదేవి, గులాబోసితాబో, ది స్కై ఈజ్ పింక్ లాంటి సినిమాలతో పోటీపడి జల్లికట్టు ఆస్కార్‌కు నామినేట్ కావడం గమనార్హం.
తాజావార్తలు
- క్రీడలతోనే మానసిక ఉల్లాసం
- నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
- ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల పంజా
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్