గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 23, 2021 , 00:09:03

రైతు సమస్యలపై పోరాటం

రైతు సమస్యలపై పోరాటం

‘రైతుకు మన అవసరం లేకపోయినా...రైతు అవసరం మాత్రం సమాజానికి  ఉంటుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల్ని చూపిస్తూ చక్కటి సందేశంతో దర్శకుడు సముద్ర ఈ సినిమాను తెరకెక్కించారు’ అని అన్నారు నటుడు సునీల్‌. శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీకార్తికేయ, అభిరామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జైసేన’. వి.సాయి అరుణ్‌కుమార్‌ నిర్మాత. వి.సముద్ర దర్శకుడు. ఈ నెల 29న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రతిబింబించే చిత్రమిది.  రైతులకు అండగా నిలవడం అందరి బాధ్యత అని చాటిచెబుతుంది. ఇందులో సునీల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా  నటించారు. శ్రీకాంత్‌, తారకరత్న పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అని అన్నారు. ఇలాంటి సామాజిక ఇతివృత్తాల్లో నటించే అవకాశం అరుదుగా లభిస్తుందని, మంచి ఆశయంతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని సునీల్‌ అన్నారు. 

VIDEOS

logo