బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 08:00:08

సినీ ప్ర‌ముఖుల‌కు జ‌గ‌ప‌తి బాబు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్

సినీ ప్ర‌ముఖుల‌కు జ‌గ‌ప‌తి బాబు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, వాణిశ్రీ  ప్ర‌ధాన పాత్ర‌లో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ తెర‌కెక్కించిన చిత్రం ద‌సరా బుల్లోడు.1971 జ‌న‌వ‌రి 13న విడుద‌లైన ఈ చిత్రం రీసెంట్‌గా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా వీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌న‌యుడు జ‌గ‌ప‌తి బాబు సినీ ప్ర‌ముఖుల‌కు ద‌స‌రా బుల్లోడు చిత్రం ఉన్న పెన్ డ్రైవ్‌తో పాటు లెజెండ్స్ పేరుతో ఉన్న స‌రిగ‌మ కార‌వాన్‌ని బ‌హుమ‌తిగా అందించారు. 

జ‌గ‌ప‌తి బాబు తండ్రి వి.బీ రాజేంద్ర‌ప్ర‌సాద్ తొలిసారి ఏయ‌న్నార్‌తో ఆరాధ‌న అనే చిత్రం చేశారు. ఆ తరువాత ఏయన్నార్ తోనే "ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, అక్కాచెల్లెలు" వంటి చిత్రాలను నిర్మించారు. అయితే ఏయ‌న్నార్ ప్రోత్సాహంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ మెగా ఫోన్ ప‌ట్టుకోగా, ద‌ర్శ‌కుడిగా ద‌స‌రా బుల్లోడు అనే చిత్రం చేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌లైన ఈ సినిమా  సంవత్సరం పాటు ప్రదర్శితమై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.30 కేంద్రాల‌లో విడుదలైన ఈ చిత్రం 29 కేంద్రాల‌లో అర్ధ‌శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది.


VIDEOS

logo