టాలీవుడ్ యాక్టర్ జగపతిబాబు లేటెస్ట్ స్టిల్ ఒకటి అందరినీ ఆలోచనలో పడేస్తుంది. సిగ్నేచర్ తెలుపు కుర్తా పైజామాలో ఉన్న జగపతిబాబు చేతిలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని గోడపై కూర్చున్న స్టిల్‌ను ట్విటర్ లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ లుక్‌లో మీరు డైనమిక్ పొలిటిషియన్ లా కనిపిస్తున్నారు..మీరు త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..? అని ఓ అభిమాని ప్రశ్నించాడు.
అయితే ఈ ఫొటో వెనుకున్న రహస్యమేంటని నెటిజన్లు తలలు పట్టుకోకముందే సదరు అభిమానికి క్లారిటీ ఇచ్చేశాడు జగ్గూభాయ్. ‘ఖచ్చితంగా పొలిటిషియన్ లా ఉండాలనుకోవడం లేదు ‘ అని జగపతిబాబు సమాధానమిచ్చాడు. జగ్గూభాయ్ స్టిల్కు సింగర్ స్మిత ‘హహహ’ అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. ‘ఫ్యామిలీ’ హీరోగా ఉండటం మీ గొప్ప ఆస్తి అయితే మీరు రాజకీయ నాయకుడిగా మారడానికి అనుమతించరు అంటూ మరో అభిమాని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం జగ్గూబాయ్ పుష్ప, టక్ జగదీష్, రిపబ్లిక్, మహాసముద్రంతోపాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న