శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 09:58:28

నెత్తిన ముళ్ల కిరీటం, చేతుల‌కు శిలువ‌.. జ‌గ‌ప‌తి బాబు లుక్ వైర‌ల్

నెత్తిన ముళ్ల కిరీటం, చేతుల‌కు శిలువ‌.. జ‌గ‌ప‌తి బాబు లుక్ వైర‌ల్

ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. తండ్రిగా, మామ‌గా, విల‌న్‌గా ఇలా వైవిధ్యమైన పాత్ర‌లు పోషిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఎఫ్‌సీయూకే’ (ఫాదర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం చేస్తున్నాడు. విద్యాసార‌గ‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. 

ఎఫ్‌సీయూకే చిత్రం పూర్తి రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కింద‌ని చెప్పిన జ‌గ‌ప‌తి బాబు ఇందులో తండ్రిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జ‌గ‌ప‌తి బాబు అప్పుడ‌ప్పుడు త‌న సినిమాల‌కు సంబంధించిన విశేషాల‌ను షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా చేతుల‌కు శిలువ‌, నెత్తిన కిరీటం, పొట్టంతా లోప‌లికి పోయి ఎండ‌క‌పోయిన‌ట్టు ఉన్న ఫొటోని  ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. దీనికి ఎలాంటి క్యాప్ష‌న్ ఇవ్వ‌క‌పోయే  సరికి అభిమానులు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు.  క్లారిటీ ఇవ్వండి స‌ర్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు.

VIDEOS

logo