మంగళవారం 07 జూలై 2020
Cinema - May 25, 2020 , 13:36:39

సినీ కార్మికుల‌కి అండ‌గా జ‌గ‌ప‌తి బాబు

సినీ కార్మికుల‌కి అండ‌గా జ‌గ‌ప‌తి బాబు

లాక్‌డౌన్ వ‌ల‌న వినోద ప‌రిశ్ర‌మ పూర్తిగా స్తంభించింది. దిన‌స‌రి వేతనం పొందే కార్మికులు అవ‌స్త‌లు ప‌డుతున్నారు. వీరికి అండ‌గా టాలీవుడ్ చిరంజీవి నేతృత్వంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) అనే ఏర్పాటైంది. ఈ ఛారిటీ ద్వారా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మ‌రోవైపు కొంద‌రు ప్ర‌ముఖులు కూడా సినీ కార్మికులకి త‌మ వంతు సాయం చేస్తున్నారు.

తాజాగా విల‌క్షణ‌ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు సినీ కార్మికులకి నిత్యావ‌స‌ర స‌రుకులు అందించారు. ఇందులో భాగంగా 400 మందికి బియ్యం, ప‌ప్పు, నూనె, మాస్క్‌లు ఇచ్చారు. ఆ మ‌ధ్య క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి జ‌గ‌ప‌తి బాబు ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విష‌యం తెలిసిందే.  గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి వాటిని అందించారు. విప‌త్క‌ర కాలంలో  విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ముందు జాగ్రత్తగా వీటిని అందించినట్లు జగపతిబాబు పేర్కొన్నారు. 


logo