బుధవారం 03 జూన్ 2020
Cinema - May 08, 2020 , 10:37:42

స‌ల్మాన్ ఫాం హౌజ్‌లో జాక్వెలిన్.. వీడియో షేర్ చేసిన బ్యూటీ

స‌ల్మాన్ ఫాం హౌజ్‌లో జాక్వెలిన్.. వీడియో షేర్ చేసిన బ్యూటీ

లాక్ డౌన్ వ‌ల‌న స‌ల్మాన్ గ‌త కొద్ది రోజులుగా ప‌న్వెల్ ఫాం హౌజ్‌కి ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. అప్పుడ‌ప్పుడు అక్క‌డ అంద‌మైన ప‌రిస‌రాల‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తున్నారు స‌ల్లూ భాయ్. అయితే శ్రీలంక‌న్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ప‌న్వెల్ ఫాంహౌజ్‌లోనే ఉండ‌గా, తాజాగా అక్క‌డి ప్ర‌కృతిని త‌న కెమెరాలో బంధించి ఓ వీడియో షేర్ చేసింది. ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 

జాక్వెలిన్ త‌న ఇన్‌స్టాగ్రాములో లిటిల్ ఫిలిం అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో కొత్త రోజుని స్వాగ‌తిస్తూ ఆమె లేవ‌గా, త‌ర్వాత స్నానం చేయడం, పెంపుడు జంతువ‌ల‌కి  ఆహారం పెట్ట‌డం, గుర్రపు స్వారీ చేయడం, బట్టలు ఆరబెట్టడం, త‌నకి తాను కాఫీ పెట్టుకోవ‌డం, డియ‌ర్ క్వారంటైన అనే నోట్‌తో పాటు ఇతర రోజువారీ కార్యకలాపాలని ఆ వీడియోలో చూపించింది. అంతేకాదు పెంపుడు జంతువులని, కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బ‌రి కాయ‌లు కోయ‌డం వంటి అంద‌మైన స‌న్నివేశాల‌ని త‌న కెమెరాలో బంధించి నెటిజ‌న్స్ ముందు ఉంచింది. జాక్వెలిన్ షూట్ చేసిన ఈ వీడియోపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


logo