శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 21:06:07

పెళ్లికి పనికిరారు అంటున్నార‌ట‌..జబర్దస్త్ కమెడియన్స్ ఆవేద‌న‌

పెళ్లికి పనికిరారు అంటున్నార‌ట‌..జబర్దస్త్ కమెడియన్స్ ఆవేద‌న‌

జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఎంతో మంది కమెడియన్లు ఈ షో నుంచి పాపులర్ అయ్యారు. క్రేజ్ తెచ్చుకున్నారు.. స్టార్స్ కూడా అయ్యారు. అందులో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. అయితే అందులో చాలా మంది కమెడియన్స్ కు మాత్రం లేడీ గెటప్స్ వేసుకున్న తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ కొందరు కమెడియన్లు ఒరిజినల్ గా ఎలా ఉంటారో తెలియదు. అబ్బాయిలుగా వాళ్లు కనిపించలేదు జబర్దస్త్ లో. ఎప్పుడూ అమ్మాయి గెటప్ లోనే కనిపిస్తుంటారు. దాంతో వాళ్లను అలాగే గుర్తు పడతారు ప్రేక్షకులు కూడా. ముఖ్యంగా బయట ఎక్కడైనా ఈవెంట్స్ కు వచ్చినపుడు కూడా వాళ్లు అదే గెటప్స్ లో వస్తుంటారు. ముఖ్యంగా లేడీ గెటప్స్ వేసుకున్న తర్వాత వాళ్లకు క్రేజ్ వచ్చింది కాబట్టి అలాగే కంటిన్యూ అయిపోతున్నారు వాళ్లు. 

ఇదిలా ఉంటే తాజాగా ఒకేసారి ఎనిమిది మంది జబర్తస్ కమెడియన్స్ క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చారు. సుమ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి 8 మందిని తీసుకొచ్చారు. వాళ్లంతా జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయ్యారు. అందులో శాంతి స్వరూప్, తన్మయ్, మోహన్ లాంటి వాళ్లు ముందుంటారు. వీళ్ల ఒరిజినల్ గెటప్ ఏంటో ఎవరికీ కనీసం ఐడియా కూడా లేదు. ఎందుకంటే బయటికి వచ్చిన ప్రతీసారి అలాగే కనిపిస్తుంటారు వాళ్లు. అమ్మాయిలు కూడా కుళ్లుకునేలా రెడీ అవుతుంటారు ఈ కమెడియన్స్ అంతా. లేడీ గెటప్స్ తమకు గుర్తింపుతో పాటు బాధ కూడా తెస్తుందని.. బయట తమను అంతా అలా అనుకుంటున్నట్లు తెలిపారు వాళ్లు. 

వీళ్లకు పెళ్ళి కాదు.. అయినా కూడా ఏం పనికిరారు అంటూ చీప్ గా మాట్లాడుతుంటారని.. తమ గురించి నీచంగా ఆలోచిస్తుంటారని శాంతి స్వరూప్ చెప్పుకుని బాధ పడ్డాడు. తమకు కూడా మనసు ఉంటుందని.. ఇదంతా కేవలం తాము ప్రొఫెషన్ లో భాగంగానే చేస్తున్నాం కానీ ఒరిజినల్ గా కాదు కదా అనే విషయం అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు. తమను తమలా అర్థం చేసుకునే అమ్మాయిలు వచ్చినపుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని చెప్పాడాయన. కానీ బయట సమాజంలో మాత్రం తమను మనుషుల్లా కూడా ట్రీట్ చేయట్లేదని.. ఏదో తప్పు చేసిన వాళ్లలా చూస్తున్నారని చెప్పుకొచ్చాడు ఈయన. శాంతి స్వరూప్ మాత్రమే కాదు మిగిలిన వాళ్లు కూడా తమ మనసులో ఉన్న బాధను బయటికి చెప్పుకుని బాధ పడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.