శనివారం 30 మే 2020
Cinema - Apr 30, 2020 , 17:07:40

రైతుగా మారిన జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్

రైతుగా మారిన జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్

జ‌బ‌ర్థ‌స్త్‌లో టీమ్ కంటెస్టెంట్‌గా ఎంట‌ర్ అయిన‌ జీవ‌న్ టీమ్ లీడ‌ర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. లాక్‌డౌన్‌ దెబ్బకి అంతా స్తంభించిపోయింది. టీవీ సీరియల్‌లు, షోలు అన్నీ రిపీట్‌ వేసుకుంటున్నాయి. ఇక మెగాస్టార్‌ నుండి చిన్న స్టార్‌ వరకు వాళ్ళూ వీళ్ళు అని తేడా లేకుండా యెడా పెడా వీడియోలు పెట్టేస్తున్నారు. ఇప్పడు జబర్థస్త్‌ టీమ్‌ లీడర్‌ జీవన్‌ వంతు వచ్చింది. లాక్‌డౌన్‌లో ఊర్లో ఇరుక్కుపోయిన జీవన్‌ వ్యవసాయం పనుల్లో బిజీ అయిపోయాడు. 

వరి పంట కోతల తర్వాత వడ్లను తూర్పార పడుతూ ఓ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. కష్టపడ్డవారు ఎప్పటికీ చెడిపోరు.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, విస్సా, జెమిని ఎంట‌ర్‌టైన్‌మెంట్ చాన‌ల్‌లో యాంక‌రింగ్ చేసే అవ‌కాశాన్ని చేజిక్కించుకున్నాడు జీవన్‌.   అక్క‌డ ఆయన ప్ర‌తిభ‌ను గుర్తించిన జబర్ధస్త్‌ హాస్య‌న‌టులు కిరాక్ ఆర్‌.పి, చ‌మ్మ‌క్ చంద్ర తమ స్కిట్‌లో అవ‌కాశం ఇచ్చారు.  అయితే జ‌బ‌ర్ద‌స్త్ కంటె ముందే ఎన్నో స్టేజ్‌పెర్ఫామెన్స్‌లు ఇచ్చాడ‌ని చెప్పుకొచ్చాడు జీవ‌న్‌.   నిజానికి సంగీత ద‌ర్శ‌కుడిగా రాణించాల‌ని కోరిక ఉండేద‌ట‌. ఆ మ‌క్కువ‌తోనే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు.logo