గురువారం 04 జూన్ 2020
Cinema - May 07, 2020 , 18:56:54

లాక్‌డౌన్‌లో యాంక‌ర్ల‌కు మైండ్ గేమ్‌

లాక్‌డౌన్‌లో యాంక‌ర్ల‌కు మైండ్ గేమ్‌

బిగ్‌బాస్ ఫేమ్ హ‌రితేజ‌, యాంక‌ర్ అన‌సూయ‌, శ్రీ ముఖీలు స్టేజ్ ఎక్కితే ఎంత యాక్టివ్‌గా ఉంటారో ఇంట్లో కూడా అంతే ఉత్సాహంగా ఉంటారు. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ వీడియో. లాక్‌డౌన్‌లో షూటింగుల‌కు దూర‌మైన వీళ్లు ఇంట్లోనే ఉంటున్నారు. యాంక‌రింగ్ చేయాలంటే మైండ్ షార్ప్‌గా ఉండాలి. స్పాంటెనిటీతో దూసుకుపోవాలి. ఒక‌టిన్న‌ర నెల నుంచి ఇంటికే ప‌రిమిత‌మైన వీళ్ల‌ మైండ్ ఎంత షార్పుగా ఉందో ప‌రీక్షించేందుకు ఓ గేమ్ ఆడుతున్నారు. ఎమోజీల ఆధారంగా సినిమా పేర్లు, పండ్ల పేర్లు చెప్ప‌మంటూ ప‌జిల్స్ ఇస్తున్నారు. 

వీడియోలో ఫ‌స్ట్ హ‌రితేజ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. త‌న‌కు వ‌చ్చిన ప‌జిల్‌కు  క్ష‌ణాల్లో జ‌వాబు చెబుతుంది. చెప్పేట‌ప్పుడు ఆమె ముఖ క‌ద‌లిక‌లు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. ఇక‌పోతే అన‌సూయ కాస్త టైం తీసుకున్నా.. శ్రీ‌ముఖి మాత్రం ప‌జిల్స్‌ల‌న్నింటినీ ఉఫ్‌మ‌ని ఊదేసింది. ఈ గ‌మ్మ‌త్తు గేమ్ వీడియోనే మీరూ ఓ లుక్కేయండి.
logo