శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 21:50:33

ఆదిపురుష్ లాంఛింగ్​కు టైం ఫిక్స్..!

ఆదిపురుష్ లాంఛింగ్​కు టైం ఫిక్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ అవుతున్నాడు. ఇటీవ‌లే ప్ర‌శాంత్‌నీల్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న స‌లార్ పూజా కార్య‌క్ర‌మం జ‌రుపుకుంది. తాజాగా ప్ర‌భాస్ మ‌రో ప్రాజెక్టు కూడా స్పీడందుకోనుంది. మైథ‌లాజిక‌ల్ మాగ్న‌మ్ ఓప‌స్ ప్రాజెక్టు ఆదిపురుష్ లాంఛింగ్ కు కూడా స‌ర్వం సిద్ద‌మైంది. జ‌న‌వ‌రి 19న (మంగ‌ళ‌వారం) గ్రాండ్‌గా ఆదిపురుష్ లాంఛింగ్ కు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. రేపు ఉద‌యం 7.11 గంట‌ల‌కు ఎక్జ‌యిటింగ్ అనౌన్స్ మెంట్ అంటూ ప్ర‌భాస్ ట్రెండ్స్ లో ట్వీట్ వైర‌ల్ అవుతోంది. 

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రావ‌త్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా న‌టిస్తున్నాడు. సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోంది.  దర్శక నిర్మాతలు ఈ చిత్రం కోసం 300 కోట్లకు బడ్జెట్ పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌పై రానున్న రోజుల్లో స్ప‌ష్ట‌త రానుంది. హిందీ, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో వ‌స్తోన్న ఈ చిత్రాన్ని భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్, ఓం రావ‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. స‌లార్, ఆది పురుష్ చిత్రాల‌కు ఎలా డేట్స్ స‌ర్దుబాటు చేస్తాడో..? చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజ‌ల్

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

సురేంద‌ర్ రెడ్డికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo