శుక్రవారం 29 మే 2020
Cinema - May 06, 2020 , 16:41:12

హిందీలో నితిన్ సినిమాల‌కి భ‌లే గిరాకీ..!

హిందీలో నితిన్ సినిమాల‌కి భ‌లే గిరాకీ..!

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినిమాల‌కి హిందీలో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. కొన్ని సినిమాలు రీమేక్ అవుతుండ‌గా, మ‌రి కొన్ని సినిమాలు హిందీలో డ‌బ్ జ‌రుపుకొని ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాయి. తాజాగా సౌత్ ఇండియాలోనే అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీగా కొన‌సాగుతున్న ఆదిత్య మ్యూజిక్ కి సంబంధించిన యూట్యూబ్ ఛాన‌ల్ లో నితిన్ న‌టించిన సినిమాల‌ని హిందీలో డ‌బ్ చేసి అప్ లోడ్ చేశారు. వాటికి 400 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం. 

నితిన్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలు అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వెర్ష‌న్ కు ఓవ‌ర్ ఆల్ గా 400 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం. ఇందులో దాదాపు అఆ కు 182 మిలియ‌న్ల వ్యూస్, అ ఆ 2 (ఛ‌ల్ మోహ‌న్ రంగ హిందీ వెర్ష‌న్) కు 112 మిలియ‌న్ల వ్యూస్, శ్రీనివాస క‌ళ్యాణం కు 100 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. నితిన్ న‌టించిన ఈ మూడు సినిమాలుకి సంబంధించిన హిందీ డ‌బ్బింగ్ రైట్ ఆదిత్య మూవీస్ తోనే ఉన్నాయి.అలానే  ఈ మూడు సినిమాలు నితిన్ కెరీర్ లో వ‌రుస‌గా రిలీజ్ అవ్వ‌డం విశేషం.  


logo